రేవంత్ , చంద్రబాబు మీటింగ్ పై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి జలాలపై సమస్యల మీద పరిష్కారం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించినట్లు పేర్కొన్నారు.

కానీ, బనకచర్ల ఎజెండాలో లేదు, బనకచర్ల గురించి అసలు చర్చ జరగలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడి, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు.
ఎజెండాలో మొదటి అంశం బనకచర్లపై ఉంటే, రేవంత్ రెడ్డి అసలు ఎజెండాలో ఆ అంశమే లేదని అబద్ధాలు మాట్లాడుతున్నాడు… ఆంధ్రప్రదేశ్ మంత్రి చర్చలో బనకచర్లపై చర్చించాం.. వారంలోపు కమిటీ వేస్తామని అంటున్నాడని వెల్లడించారు. రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి, రాష్ట్ర ప్రయోజనాలను మట్టిలో తొక్కుతున్నాడని చెప్పారు.