కల్వకుంట్ల కవితకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఊహించని షాక్ ఇచ్చాడు. TGBKS ఇన్చార్జి పదవిని… కొప్పుల ఈశ్వర్ కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించినట్లు ఈ సందర్భంగా అధికారిక ప్రకటన చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

తెలంగాణ భవన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. గులాబీ పార్టీకి అనుబంధంగా ఏర్పడిందే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. దీనికి మొన్నటి వరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలిగా ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ ను నియమించి.. కవితకు షాక్ ఇచ్చాడు కేటీఆర్.