తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తాజాగా పత్రిక ప్రకటన విడుదల చేశారు. అందులో.. 63.86 లక్షల మందికి రైతుబంధు.. రూ.6764.94 కోట్లు పంపిణీ చేసినట్లు.. ఇప్పటి వరకు కోటి 35 లక్షల ఎకరాలకు సాయం అందించినట్లు తెలిపారు. అయితే.. ఇంకా రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతుందని, దేశంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ సమాధానాలు చెప్పరా ? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రశ్నలతో బీజేపీలో ప్రకంపనలు వస్తున్నాయని, అన్నింటా విఫలమైన మోడీ ఏం చెప్పాలో తెలీక మీడియా మొకం చూడడం లేదన్నారు.
ఎనిమిదేళ్లుగా ప్రధాని మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని, చేసిన అభివృద్ధి .. పెట్టిన పథకాల గురించి మాట్లాడమంటే .. అవి వదిలేసి బీజేపీ నేతలు అన్నీ మాట్లాడుతున్నారన్నారు. దేశాన్ని అన్ని రంగాలలో మోడీ వెనకబడేశారని, అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. మభ్యపెట్టే రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు సమాధానం చెప్తారని, కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేళ్లలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి అవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.