రైతుల పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందే..- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

-

తెలంగాణ నాయకులు కేంద్రం తీరును విమర్శిస్తూనే ఉన్నారు. తాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రం తీరుపై ఫైరయ్యారు. రైతుల పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందే అని అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ఓ మాట చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మరో మాట చెబుతున్నారన్నారు. కేంద్రం తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. దేశంలో చాలా మంది ఆహరం లేకుండా బాధపడుతున్నారని.. కేంద్రం దగ్గర ఉన్న ధాన్యం నిలువను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూనె గింజల పంటలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రం పంట మార్పిడికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం లేదని విమర్శించారు నిరంజన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా పంట మార్పిడిపై కేంద్రమే ఓ విధానాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని అన్నారు. కానీ కొత్త మార్గాలు అన్వేషించకుండా.. రైతుల్ని గోస పెడుతుందని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరిని సాగుచేశామని.. ఆధునిక పద్దతుల్లో గణాంకాలు నమోదు చేశామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version