నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష తేది ఖ‌రారు..

-

2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల నిర్భయపై నిందితులు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా వేధించారు. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ.. 29 డిసెంబర్ 2012న తుదిశ్వాస విడిచింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు నలుగురికీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్‌ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు వీరందరినీ ఉరి తీయాలని ఆదేశాలిచ్చింది. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు చేసేలా డెత్ వారెంట్ జారీ చేయాలంటూ ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

కాగా, తమ కుమార్తె కేసులో న్యాయం కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నామనీ కోర్టు తమకు సత్వర న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని నిర్భయ తల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై అత్యాచారం, హత్యానేరం సహా పలు అభియోగాలు మోపారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలై అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. మరో నిందితుడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version