నిర్భయ దోషులు జైల్లో ఎంత సంపాదించారో తెలుసా..?

-

2012లో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై దారుణ హత్యాచారం చేసి, అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉంటూ, ఈ నెల 22న ఉరిశిక్షను ఎదుర్కోనున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు జైల్లో పని చేసి, వేల రూపాయలను సంపాదించగా, వాటిని కుటుంబీకులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు తిహార్ జైల్లో ఉన్నపుడు చేసిన పనికి పొందిన వేతనాల డబ్బును జైలు అధికారులు లెక్క వేశారు. ముకేశ్ సింగ్ జైల్లో అందరికంటే అత్యధికంగా రూ.69వేలు సంపాదించారు.

మరో దోషి వినయ్ శర్మ రూ.39వేలు, పవన్ గుప్తా రూ.29వేలు సంపాదించారు. మరో దోషి అక్షయ్‌ కుమార్ జైలులో కూలీగా పనిచేసేందుకు నిరాకరించాడు. దీంతో అతనికి జైల్లో ఎలాంటి వేతనం దక్కలేదు. ఇదిలావుండగా, దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నలుగురికీ పెడుతున్న భోజనాన్ని తగ్గించారు. జైలులో వినయ్ శర్మ పలుమార్లు అనుచితంగా ప్రవర్తించినందున అతన్ని 11 సార్లు శిక్షించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version