ఢిల్లీ ఎన్నికల ముందు ఉరి తీస్తారా…?

-

నిర్భయ హంతకుల ఉరి అమలు విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ నలుగురికి ఉరి అమలు విషయంలో ఇప్పుడు అసలు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు సార్లు విధించిన ఉరిని వాయిదా ఎందుకు వేసారో ఎవరికి అర్ధం కాలేదు. వాళ్ళను ఉరి తీయనివ్వమని లాయర్ కోర్ట్ లో సవాల్ చేయడం కూడా అందరిని విష్మయానికి గురి చేసింది.

పిటీషన్ల మీద పిటీషన్లు దాఖలు చేస్తూ మూడు నెలల నుంచి ఉరి అమలు జరగకుండా ఆపుతూ వస్తున్నారు. వాస్తవానికి వారిని ఈ నెల ఒకటి ఉరి తీయాల్సి ఉంది. కాని కోర్ట్ కి వెళ్ళడంతో ఉరి వాయిదా పడింది. అయితే దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అనే వాదనలకు ఇప్పుడు బలం చేకూరుతుంది. వాళ్ళను ఉరి తీస్తాం తీస్తాం, అనుమతి ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్ట్ కి వెళ్ళింది.

పాటియాలా హౌస్ కోర్ట్ నుంచి ఢిల్లీ హైకోర్ట్ కి వెళ్ళగా అక్కడ కేంద్రానికి షాక్ తగిలింది. ఇప్పుడు మళ్ళీ మేము ఉరి తీస్తామని సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వాళ్ళను ఢిల్లీ ఎన్నికల ముందు రోజు ఉరి తీసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీని ద్వారా రాజకీయ లబ్ది కోసం ఒక పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉరిని వాయిదా వేయిస్తుందని అంటున్నారు. దీని గురించి ఎక్కువ వాదన అవసరం లేదని కావాలనే ఉరి వాయిదా పడుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version