ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం పై స్పందించిన నిర్మలా సీతా రామన్..!

-

భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మీదకి ఎస్బీఐ అందించిన ఎలక్ట్రాల్ బాండ్ల వివరాలని ఈసీ వెబ్సైట్లో పెట్టింది. ఆ వివరాలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కొన్ని సంస్థల మీద గతంలో సిబిఐ ఈడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని అనే అంశం ఇప్పుడు చర్చికి దారి తీసింది. ఈ వ్యవహారం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. విరాళాలకి దర్యాప్తు సంస్థలు దాడులకి సంబంధం ఉందన్న ప్రచారాలన్నీ ఊహాగానాలు.

దర్యాప్తు సంస్థలు దాడి చేస్తేనే బాండ్లను కొన్నారు అనేది పూర్తిగా అబద్దం బాండ్లు కొన్న తర్వాత కూడా ఆయా కంపెనీల మీద దాడులు జరిగాయి ఆ కంపెనీలు బిజెపికి విరాళం ఇచ్చాయని చాలామంది భావిస్తున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా అవి వెళ్ళయని నిర్మల సీతారామన్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశించిన అంశం గురించి మాట్లాడుతూ ఎస్బీఐ దాని గురించి చూసుకుంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news