నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాష్ట్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలోని బ్రాహ్మణవెల్లంలలో పర్యటించారు. శుక్రవారం రూ.30 కోట్ల రూపాయలతో బ్రాహ్మణవెల్లంలలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణవెల్లంలే నా బలం.. బలగం అని చెప్పారు.
బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ ద్వారా ఖరీఫ్లో సాగు నీరు లో అందిస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో మిగిలేది నలుగురు కుటుంబసభ్యులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. దీనిని బీఆర్ఎస్ నేతలు
జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని. మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.