విలేకరిపై రక్షణ శాఖ మంత్రి ఫైర్…

-

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ విలేకరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోపాల్‌లోని మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆమెను.. సర్జికల్స్‌ స్ట్రైక్‌ జరిగి రెండేళ్లైనా తర్వాత ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రచారం (టాం టాం) (బిన్‌ బాజాయే) ఎందుకు చేస్తోందని విలేకరి వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ మీరు వ్యగ్యంగా ప్రశ్న అడిగిన తీరు ఆమె తప్పుబట్టారు. మీరు ఉపయోగించిన బిన్‌ బజాయేకు పదానికి అర్ధం తెలుసునని, తనకు హిందీ అర్థం అవుతుందని ఆ విలేకరికి వార్నింగ్ ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు ఆ పార్టీ నేతలు.. భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల వివరిస్తూ.. ‘ఈ మెరుపు దాడులు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి. శత్రువులపై దాడి సిగ్గుపడే అంశమా?. వాళ్లు ఉగ్రవాదుల సాయంతో మన సైనికులపై దాడికి దిగుతున్నారు. మనం వారి ఉగ్రవాదుల క్యాంపులను లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధి వ్యంగ్యంగా ప్రశ్నించడం భాధించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version