ప్రతి ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసే ప్రపంచ వ్యాప్తం గా అత్యంత శక్తి వంతమైన 100 మంది మహిళల జాబితా లో దేశ ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చోటు దక్కించు కుంది. నిర్మాలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితా లో వరుస గా మూడో సంవత్సరం కూడా చోటు దక్కించు కుంది. ఈ ఏడాది నిర్మాలా సీతారామన్ ఈ జిబితా లో 37 వ ర్యాంకు లో నిలిచారు. గద సంవత్సరం ఫోర్బ్స్ జాబితా లో నిర్మాలా సీతారామన్ 41 వ స్థానం లో ఉండేవారు. కాగ 2021 ఫోర్బ్స్ జాబితా లో మొదటి స్థానం లో అమెరికా కు చెందిన మెకెంజీ స్కాట్ ఉన్నారు.
అలాగే రెండో స్థానం లో అమెరికా ఉపాధక్షురాలు భారత సంతతి కి చెందిన కమలా హరీస్ ఉన్నారు. కాగ ఫోర్భ్స్ విడుదల చేసిన అత్యంత శక్తి వంతమైన 100 మంది మహిళల జాబితా లో భారత్ నుంచి నిర్మాలా సీతారామన్ తో పాటు వ్యాపార వేత్త రోహిణి నాడార్ 52 వ స్థానం లో ఉన్నారు. అలాగే హెచ్ సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ కిరణ్ మంజుదార్ షా 72 వ స్థానం లో ఉన్నారు. అలాగే న్యాకా వ్యవస్థాపకురాలు, సీఈవో ఫల్గుణి నాయర్ కూడా ఈ జాబితా లో ఉన్నారు. ఫల్గుణి నాయర్ ఈ జాబితా లో 88 వ స్థానం దక్కించు కున్నారు. కాగ ఫల్గుణి నాయర్ ఇటీవలే భారత్ లో ఏడవ మహిళా బిలియనీర్ గా నిలిచారు.