జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

బీహార్ లో జనాభా నియంత్రణపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. శనివారం వైశాలి లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న నితీష్ కుమార్ మహిళలు, విద్యావంతులు మారేవరకు బీహార్ లో జనాభా తగ్గదని కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నితీష్ కుమార్ చేపట్టిన సామధాన్ యాత్రలో భాగంగా వైశాలి లో జరిగిన బహిరంగ సభలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నితీష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుండి ఎదురు దెబ్బ తగిలింది. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్ వ్యాఖ్యలు అసభ్యకరమైనవని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో నితీష్ కుమార్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version