ప్రేక్షకులను ” పాగల్” చేయనున్న నివేథా పేతురాజ్..

-

ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్, తాజాగా పాగల్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో అందరి చూపులు ఈ టీజర్ మీదకే వెళ్ళాయి. మరో మారు వైవిధ్యమైన ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడంటూ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా మరో హీరోయిన్ ని చిత్రబృందం రివీల్ చేసింది. బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో సినిమాల్లో కనిపించిన నివేథా పేతురాజ్, పాగల్ సినిమాలో నటిస్తుంది. ఈ మేరకు పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీనిలో నివేథా పేతురాజ్, విశ్వక్ సేన్ ని కౌగిలించుకుంటున్నట్టుగా ఉంది. నివేథా పేతురాజ్ స్కార్ఫ్ తో విశ్వక్ సేన్ చేతులు బంధింపబడి ఉన్నాయి. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news