మాజీ సీఎం కేసీఆర్‌పై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు!

-

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదని గులాబీ పార్టీ చెబుతోంది. గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలపై రంగంలోకి దిగిన ఈడీ… తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవెలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి లేఖ రాసిందట. ఈ విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలను సమర్పించాలని కోరిన ఈడీ…మాజీ సీఎం కేసీఆర్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదట.

KCR sensational announcement against Revanth Reddy Sarkar

అటు విద్యుత్ కొనుగోళ్ళు , కాళేశ్వరం ప్రోజెక్టుల విచారణ పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి…ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనా హామీల అమలు మరచి గత ప్రభుత్వాల పై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని ఆగ్రహించారు. కేసీఆర్‌ కు నోటీసులు ఇవ్వడం వల్ల హామీల గురించి జనాలు మర్చిపోతారని ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు.. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయి ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version