రేవంత్-సంజయ్ సీట్లపై నో క్లారిటీ?

-

నెక్స్ట్ ఎన్నికల్లో తమ పార్టీలని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇటు టి‌పి‌సిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి…తాము అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారానికి దూరమైంది..ఇంకోసారి కూడా అధికారం దక్కకపోతే ఆ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం..అందుకే ఎలాగోలా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ కష్టపడుతున్నారు.

అటు బండి సైతం..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు గట్టిగానే కష్టపడుతున్నారు…అలాగే వచ్చే ఎన్నికల్లో ఇద్దరు నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్, కరీంనగర్ లో బండి సంజయ్ ఓడిపోయారు. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో బండి…కరీంనగర్ ఎంపీగా, రేవంత్..మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. ఇలా ఇద్దరు ఎంపీలు కావడమే కాదు..తమ తమ పార్టీలకు అధ్యక్షులు కూడా అయ్యారు.

ఇలా అధ్యక్షులుగా దూసుకెళుతున్న ఇద్దరు నేతలు…వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. బలమైన ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే…వారి వారి పార్టీలకు అడ్వాంటేజ్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఫిక్స్…కానీ ఏ స్థానాల్లో పోటీ చేస్తారో క్లారిటీ రావడం లేదు. మళ్ళీ కొడంగల్ లో రేవంత్, కరీంనగర్ లో బండి పోటీ చేస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే వారు సీట్లు మార్చుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది..రేవంత్…గ్రేటర్ లోని ఉప్పల్ లేదా ఎల్బీనగర్ లో పోటీ చేయొచ్చని, అటు బండి ఏమో..వేములవాడలో పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి. కానీ ఈ సీట్ల విషయంలో కూడా క్లారిటీ లేదు. మొత్తానికైతే రేవంత్, బండి పోటీ చేసే సీట్లు ఇంకా తేలలేదు…ఎన్నికల ముందే సీట్లు తేలేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version