COVID-19 మన జీవితాలను నరకం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మునుపటిలా మరలా జనజీవితం ప్రారంభం కావాలంటే దానికి వ్యాక్సిన్ కనుగొనడమే ఏకైక మార్గం. ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి సరయిన టీకా కోసం మనమందరం తీవ్రంగా ఎదురుచూస్తున్నాము. అయితే ఇప్పటికే యునైటెడ్ కింగ్ డం, రష్యా మరియు చైనా వంటి ఇతర దేశాలలో తమ పౌరులకు టీకాలు వేయడం ప్రారంభించారు.
రష్యన్ వార్తా సంస్థ టాస్ రిపోర్ట్ ప్రకం రష్యన్ అధికారులు తమ పౌరులను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ టీకాలు వేసిన తరువాత రెండు నెలల పాటు మద్యం సేవించకుండా ఉండాలని హెచ్చరించారట. ఈ హెచ్చరిక రష్యా ఉప ప్రధాన మంత్రి టటియానా గోలికోవా నుండి వచ్చిందని అంటున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ టీకా ప్రజల శరీరాలలో కలిసిపోయి చురుకుగా అయి సర్దుకోవడానికి ఆ సమయం పడుతుండట. దీంతోప్రజలు సురక్షితంగా ఉండటానికి ఈ మార్గదర్శకాలు జారీ చేశారని అంటున్నారు. దీనికి 42 రోజులు పట్టవచ్చని అంటున్నారు.