సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నూతన వక్ఫ్ సవరణ చట్టంపై పాక్షిక స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు… సంచలనానికి తెరలేపింది. వక్ఫ్ చట్టంలోని మూడు నిబంధనలపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజారిటీ ఉండాలని.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిం వ్యక్తే ఉండాలని తెలిపింది సుప్రీం ధర్మాసనం.

బోర్డు లేదా కౌన్సిల్లో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ముస్లిమేతర వ్యక్తులు ఉండాలని చెప్పింది సుప్రీం కోర్టు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిలిపివేయాలంటూ దాదాపు 100కు పైగా దాఖలైయ్యాయి పిటిషన్లు. ఈ పిటీషన్లను విచారించి తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మా సనం.