మహాలక్ష్మి లేదు మన్నులక్ష్మి లేదు: కేసిఆర్

-

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ‘రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? పెళ్లి చేసుకుంటే రూ. లక్ష, తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఏమైంది? అని ప్రశ్నించారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతుబంధు ఇవ్వలేదు. నెలకు రూ.4 వేల పెన్షన్ ఇంట్లో ఇద్దరికీ ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? అని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. మహాలక్ష్మి లేదు మన్నులక్ష్మి లేదు’ అని కేసిఆర్ మండిపడ్డారు.

తాను వస్తున్నానని తెలిసి కాళేశ్వరం నీళ్లు వదిలారని కేసీఆర్ అన్నారు. ‘నేను మొన్న నల్గొండ వెళ్లి రాగానే సాగర్ ఎడమ కాల్వకు నీరు వదిలారు అని అన్నారు. ఇప్పుడు కరీంనగర్ వస్తున్నానని తెలిసి పడిపోయాయన్న కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాల్వకు నీళ్లు విడుదల చేశారు అని మండిపడ్డారు.నీళ్లు వదలాలని కేసీఆర్ ముందే చెప్పాలని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్య మంత్రి నువ్వా? నేనా?’ అని కేసీఆర్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news