టీడీపీలో లోకేష్ మాట చెల్లడం లేదు… ఇదిగో సాక్ష్యం!!

-

అధినేత సుపుత్రుడు, అపరమేధావి, విద్యావంతుడు అయిన నారా లోకేష్ ను టీడీపీ తరుపున భవిష్యత్ ముఖ్యమంత్రి అని, చంద్రబాబు తర్వాత ఆయనే టీడీపీకి అన్నీ అని అంతా చెబుతుండేవారు! టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వంలో అన్నీ తానై నడిపించారని కూడా చెబుతుంటారు! అయితే అది గతం.. ఇప్పుడు తగిలిన దెబ్బల అనంతరం బాబు ఇంక అంత రిస్క్ చేయాలని అనుకోవడం లేదని.. సీనియర్లు కూడా బాబు మాటే కరెక్ట్ అని అంటున్నారని అంటున్నారు విశ్లేషకులు!

అవును… టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అని అంటే.. ఇష్టం ఉన్నా లేకున్నా ఠక్కున చెప్పే పేరు నారా లోకేష్! బాబుకు కూడా పెద్ద వయసు రావడం వల్ల.. త్వరలో ఆయన పూర్తి బాధ్యతలు చినబాబు తీసుకుంటారని… జనాల్లోకి కూడా బాబు తర్వాత చినబాబు అనే సంకేతాలు పంపాలని చూసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా హంబక్కు అని… చినబాబు మాటలకు చంద్రబాబు & సీనియర్లు అంత విలువివ్వడం లేదని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన డ్యామేజ్ చాలు… ఇంక వద్దు అని అంటున్నంతగా లైట్ తీసుకుంటున్నారంట!

అందుకు కారణమైంది… ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవి! ఈ విషయంలో కళా వెంఅట్రావు మినహా చంద్రబాబు – సీనియర్లు అంతా అచ్చెన్నాకు ఆ పదవి కట్టబెడితే బాగుంటుందని.. ఆయన దూకుడు ఈ సమయంలో పార్టీకి ప్లస్ అవ్వకపోయినా మైనస్ అయితే అవ్వదని అంటున్నారట. అయితే… అచ్చెన్నాకు ఆ పదవి కట్టబెడితే… తన పేరు పత్రికలు కూడా మరిచిపోతాయనే భయం చినబాబుకు పట్టుకుందంట. అందులో భాగంగా.. అచ్చెన్నా ఎంపికను ఆయన అడ్డుకుంటున్నారని అంటున్నారు!

అయితే.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాకే అనే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా నేడు కన్ ఫాం చేసేసింది. దీంతో.. ఇక అచ్చెన్న పేరు ప్రకటించడం లాంఛనమే అనే అభిప్రాయం తమ్ముళ్లలో కలిగింది. దీంతో… లోకేష్ అలిగారని అంటున్నారు!! తన మాటకు, తన అభిప్రాయాలకు తన తండ్రే విలువనివ్వడంలేదని బాదపడుతున్నారని అంటున్నారు! అదే నిజమైతే… లోకెష్ రాజకీయ భవిష్యత్తు అప్పుడే తిరోగమనం స్టార్ట్ చేసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version