ఏపీలో వినాయక చవితి పందిళ్ళకి, ఊరేగింపులకి నో పర్మిషన్ !

-

వినాయక మండపాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వినాయక మండపాలకు అనుమతిపై దేవదాయ శాఖ‍, పోలీస్, వైద్యారోగ్యం, జీఏడీ శాఖల ఉన్నతాధికారులతో నిన్న మంత్రి వెలంపల్లి సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాల అనుమతుల విషయంలో పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలోనూ అదే విధానాన్ని పాటించాలని అధికారుల సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు.. ఊరేగింపులపై కేంద్రం కూడా నిబంధనలు విధించిందని గుర్తు చేసిన అధికారులు, నదులు చెరువుల్లోనూ నిమజ్జనానికి అనుమతులిస్తే కోవిడ్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవు కూడా 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని మంత్రి తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version