ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఓ స్ట్రాటజీ ఉంది. ఆయన ఏ పనిచేసినా ఆచితూచి వ్యవహరిస్తారు. తండ్రి నుంచి అలవడిన రాజకీయ విద్యలను ఆయన బాగానే వాడుతుంటారు. అయితే ఈ మధ్య ఆయన తీరు అందరినీ ఆలచనలో పడేస్తోంది. ముఖ్యంగా కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. పుట్టమధుపై ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకు పడేవారు శ్రీధర్‌బాబు.
లాయర్ వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మంథనికి రప్పించి పెద్ద హంగామా చేశారు శ్రీధర్‌బాబు. కానీ పుట్టమధు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే పుట్టమధును పోలీసులు అరెస్టు చేసి విచారించారు.
ఇదే అవకాశాన్ని శ్రీధర్‌బాబు వినియోగించుకుంటారని, టీఆర్ఎస్‌పై దుమ్మెత్తిపోస్తారని ఆయన కేడర్ భావించింది. కానీ అదేమీ లేకుండా ఆయన మౌనంగా ఉన్నారు. ఎక్కడా పుట్టమధుపై ఆరోపణలు చేయకపోవడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారా లేదా పార్టీ మారే యోచనలో ఉన్నారా అనేది ఎవరికీ తెలియట్లేదు. పోనీ అసలు విషయాన్ని పట్టించుకోవట్లేదా అంటే హత్య జరిగినప్పుడు ఆయనే హంగామా చేశారు. మరి ఇప్పుడు ఆయన మౌనంగా ఉండటంతో కేడర్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.