వేతనాలు పెంచకపోతే షూటింగ్ లు నిలిపివేస్తామన్న ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటన పై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఇస్తున్నట్టు తెలిపింది. ఫెడరేషన్ తో నిర్మాతలు ప్రత్యేకంగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని.. ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా ఈ సమ్మె నిర్ణయం నిర్మాణంలోని చిత్రాలకు నష్టాన్ని కలిగిస్తుందని వెల్లడించింది.
మరోవైపు టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఫెడరేషన్ నాయకులు రేపటి నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్టు పిలుపునిచ్చారు. పెంచిన వేతనాలు కూడా ఎప్పటికప్పుడూ చెల్లించాలని కోరారు. నిర్మాతలు అంగీకరించేంత వరకు సభ్యులు హాజరుకారు అని పేర్కొన్నారు. ఇతర బాషా వెబ్ సిరీస్ లు, చిత్రాలకు కూడా ఇది వర్తిస్తుందని ఈ ప్రకటనలో తెలిపారు.