ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటిస్తున్న ఈ వేళ ఎంతో మంది ఆసక్తితో పాటు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉండనుందన్నది ఆసక్తి అయితే, ఆ బడ్జెట్ వల్ల మనకు ఒరిగేదేముందన్నది ఆశ. ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు టాక్స్ స్లాబుల్లో ఏవైనా మార్పులు రానున్నాయేమోనని ఎదురుచూసారు. కానీ అలా ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. టాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంతకుముందు ఎలా ఉండేవో అలానే కొనసాగనున్నాయి.
ఐతే 75ఏళ్ళు పైబడిన వారికి టాక్స్ నుండి ఊరట కలిగించింది. వారు ఎలాంటి ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనివల్ల దేశంలోని పెన్షనర్లకి ఎంతో మేలు కలగనుంది. పెన్షన్ తీసుకుంటూ కూడా టాక్స్ కట్టే వారికి ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఎన్ ఆర్ ఐ లకి డబుల్ టాక్సేషన్ నుండి విముక్తి కలిగించనున్నారట. మరి అదెప్పుడు అమలవుతుందో చూడాలి.