రోజు రోజుకి వాహనాల ధరలు బాగా పెరిగి పోతున్నాయి. దీనితో కొనుగోలు చెయ్యడం కూడా కష్టం అయిపోతుంది. బడ్జెట్ లో బైక్ కొనుగోలు చెయ్యాలనుకుంటే ఇవి బెస్ట్. ఇక వివరాల లోకి వెళితే… సెమీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ టోన్ కలర్, డిస్క్ బ్రేక్ వంటి గొప్ప ఫీచర్లను కూడా కంపెనీలు అందిస్తున్నాయి. ఇక వివరాల్ని చూస్తే… అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ బైక్ ఇది. Bajaj Platina 110 H-Gear గురించి చూస్తే… ఇది 2019 వేరియంట్ వాహనం 5 గేర్లను కలిగి ఉన్న హెచ్-గేర్ వేరియంట్‌తో కంపెనీ స్టార్ట్ చేసింది. పైగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఇక దీని ధర వచ్చేసి రూ .64, 301 (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది.
Hero Splendor i-Smart బైక్ ఐ-స్మార్ట్ టెక్నాలజీ అవసరం లేనప్పుడు ఇంజిన్‌ను మూసివేస్తుంది. ఈ బైక్ డిస్క్ బ్రేక్ మోడల్ కూడా ఉంది. దీని ధర వచ్చేసి రూ .68,850 గా ఉంది. Honda Livo కూడా బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. ఈ బైక్ ధర రూ .75,748 .