గ్రేటర్ ఎన్నికల్లో నేర చరితుల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ల లిస్టును బయటపెట్టింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ. మొత్తం 72 మంది కార్పొరేటర్లపై కేసులు ఉన్నాయని ఇందులో టీఆర్ఎస్ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 13, కాంగ్రెస్ నుంచి 13, బీజేపీ నుంచి నలుగురు ఇండిపెండెంట్లు 11 మంది ఉన్నారు.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే కేసులు ఈ ఉన్న వాళ్లలో ఎనిమిది మంది మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఇటు ప్రస్తుత పాలక మండలిలో 20 మంది నేర చరిత్ర గల అభ్యర్ధులు ఉన్నారని తేల్చింది. కొత్తగా 17 మంది టీఆరెస్ నేతలపై కేసులు నమోదయ్యాయని అలాగే 13 మంది బీజేపీ నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇలా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లకు టిక్కెట్లు ఇవ్వొద్దంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేస్తోంది.