హస్తానికి అస్త్రం దొరికిన నో యూజ్?

-

ఏంటో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బాగా బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది…అసలు రాజకీయంగా బలం ఉన్నా సరే..ఆ పార్టీ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. రాజకీయంగా బీజేపీ కంటే బలమైన పార్టీ అయినా సరే.. ఆ బలాన్ని ఉపయోగించుకోలేకపోతుంది. రాజకీయంగా పైకి లేవడానికి అస్త్రాలు దొరికినా సరే వాటిని ఉపయోగించుకోవడంలో విఫలమవుతుంది.

congress

వాస్తవానికి తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్…కానీ రాజకీయ పరిస్తితులు అలా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి..అసలు టీఆర్ఎస్ తర్వాత బీజేపీనే బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలా రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్యే రాజకీయ యుద్ధం నడుస్తోంది…ఈ యుద్ధంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. అసలు రాజకీయంగా కాంగ్రెస్‌కు కొన్ని అస్త్రాలు దొరికిన ఉపయోగించుకోవడం లేదు.

ఇటీవల కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే…దీనిపై బాగా పోరాటం చేయొచ్చు…అలాగే దళితులకు మరింత దగ్గర అవ్వొచ్చు.. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీనే గట్టిగా పోరాడినట్లు కనిపించింది. దీని వల్ల కాంగ్రెస్ వెనుకబడింది. ఇక ఆ విషయం పక్కనబెడితే…తాజాగా ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు…కాంగ్రెస్ పార్టీ విభజన సరిగ్గా చేయలేదని, విభజన వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయని అన్నారు. అదిగో విభజన సరిగ్గా లేదని చెప్పి మోదీ, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశాయి..మోదీ, బీజేపీ దిష్టి బొమ్మలని తగలబెట్టాయి.

అసలు తెలంగాణ వచ్చిందే కాంగ్రెస్ వల్ల అన్నట్లు మోదీ చెప్పారు..సరే విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ నష్టపోయింది…కానీ తెలంగాణలో లాభపడాలి. కానీ అది జరగలేదు..అలాగే మోదీ వ్యాఖ్యలని వాడుకుని రాజకీయంగా తెలంగాణలో బలపడాలనే ఆలోచన కూడా కాంగ్రెస్‌కు ఉన్నట్లు లేదు. మొత్తానికి మంచి మంచి అస్త్రాలు దొరికిన సరే ఉపయోగించుకోలేని స్థితిలో హస్తం పార్టీ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version