కాఫీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని కొందరు అంటూ ఉంటారు. ముఖ్యంగా కాఫీ తాగడంతో ఊబకాయం, మధుమేహం వంటివి పెరగడం గాని తగ్గడం గాని జరిగే అవకాశం ఉండదు అని అంటున్నారు వైద్యులు. తాజాగా దీనిపై చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం స్పష్టంగా అర్ధమైంది. కాఫీ తాగడం వలన మధుమేహం అదుపులో ఉంటుందని కొందరు అంటారు.
అంతే కాకుండా కాఫీ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అనేక అపోహలు జనానికి ఉంటాయి. కాని అది నిజం కాదని చెప్పారు. కాఫీ శరీరంపై ఎలాంటి ప్రభావం కలిగిస్తుందనే అంశాన్ని జన్యువుల ద్వారా మొదటిసారి అధ్యయనం చేశారు కోపెన్‌హేగెన్ విశ్వవిద్యాలయం, డెన్మార్క్‌లోని హెర్లెవ్, జెంటోఫ్టే ఆస్పత్రి పరిశోధకులు. దాదాపు 93 వేల మందిపై ఈ అధ్యయనం చేపట్టారు.
కాఫీ తాగాలనే కోరికపై ప్రభావం చూపిస్తున్న జన్యువుల సంఖ్య దిశగా వారు పరిశోధనలు చేసారు. ప్రత్యేక కాఫీ జన్యువులున్నవారు మిగతావారితో పోలిస్తే, అధికంగా రోజు కాఫీ తాగుతున్నట్లు తమ పరిశోధనల్లో వారు గుర్తించారు. ఈ జన్యువులకు టైప్2మధుమేహం, ఊబకాయంతో సంబంధం లేదని అసలు వాటికి ఏ కోశానా ఆస్కారం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేసారు.