నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడా విడి మళ్లీ మొదలైంది. నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం ఉండనుంది. నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 10 చివరి తేదీ కావడం గమనార్హం. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు.

Nominations will be accepted for 1 graduate and 2 teacher MLC posts from today

ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. రేపు ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇక కరీంనగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ ఎన్నికల్లో… ఆల్‌ఫోర్స్‌ కాలేజీ అధినేత నరేందర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ లు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news