షాకింగ్‌ : ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో 57 వేలకు పైగా నోటాకు ఓట్లు

-

దేశంలోని ఓటర్లకు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు నచ్చని పక్షంలో ఎవ్వరికీ ఓటు వేయకుండా నోటా (NOTA) ఆప్షన్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న వెలువడిన ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ఆప్‌ మరోసారి సత్తా చాటింది. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్‌ 134 సీట్లు గెలుపొందింది.

రాజధాని నగరంలో 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీని 104 వార్డులకే పరిమితం చేసింది. అయితే ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. గత ఆదివారం జరిగిన పోలింగ్‌లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి. అంటే తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేయడం విశేషం. ఢిల్లీలో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. వారిలో 78,93,418 పురుషులు, 66,10,879 మంది మహిళలు, 1,061 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఎంసీడీ ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 మంది నోటాకు ఓటేశారు. అంటే 0.78 శాతం మంది అన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version