పెళ్లికి ముందు అలా చేయ‌డం త‌ప్పు కాద‌ట‌.. కియారా అద్వానీ హాట్ కామెంట్స్‌..!

-

కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో కియారా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన ‘విన‌య విధేయ రామ’లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఈమె టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌నూ బుట్టలో వేసుకుంది. ఈ క్ర‌మంలోనే హిందీలో ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్, కబీర్ సింగ్ లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే గ‌త ఏడాది చివ‌రిలో అక్షయ్ కుమార్‌తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’ అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా.

ఈ సినిమాతో పాటు మ‌రి కొన్ని సినిమాల‌కు కూడా సైన్ చేసి ఫుల్ బిజీగా ఉంది కియారా. అయితే తాజాగా సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా అద్వానీ బ్రైడల్ లుక్‌‌ను బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ ఫిబ్రవరి నెల కవర్ పేజీపై ముద్రించింది. ఈ సందర్భంగా ఆమెను బ్రైడల్ లుక్‌‌‌లో ఫోటో షూట్ చేశారు. ఇకపోతే ఇదే బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ వాళ్ళతో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ లవ్, రొమాన్స్, రిలేషన్‌షిప్స్‌ గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. పెళ్లికి ముందు డేటింగ్ చేసినా ఎలాంటి తప్పు లేదు అంటూ సంచలన ప్రకటన చేసింది. పెళ్లికి ముందు కలిసి తిరగడంలో తప్పు లేదని… ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అయితే, తాను మాత్రం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని సెలవిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version