ఆంధ్రప్రదేశ్ లో ఆ మాజీ మంత్రికి మరోసారి నోటీసులు అందించారు పోలీసులు. ఈయన 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి గెలిచి రెండో సారి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆ తరువాత వైసీపీ అధినేత జగన్ మంత్రి పదవీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అయింది. ఓ జైలులో ఫైల్ మిస్సింగ్ కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కేసును కోర్టు కొట్టేసింది. ఆ తరువాత సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి ఓడిపోయారు.
అప్పటి నాయకులు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం బయటకు తీసింది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా ఉన్నారు. వైసీపీ హయాంలో మైనింగ్ కి సంబంధించి అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు అందిన ఫిర్యాదుతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. ఈ కేసులో కాకాణిని విచారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.