తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..ఈ నెలలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​!

-

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఖాళీల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక నియామకాలు చేపడతామని కేసీఆర్‌ సర్కార్‌ గతంలోనే ప్రకటించింది.2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి.. కొత్త జోనల్‌ విధానానికి అనుగునంగా ఉద్యోగు విభజన, కేటాయింపు ప్రక్రియను గత డిసెంబర్‌ లో చేపట్టారు.

తాజాగా పరస్పర బదిలీలకు కూడా సర్కార్‌ మార్గ దర్శకాలు జారీ చేసింది. 50 వేలకు పైగా ఖాళీల భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరగా నోటీఫికేషన్లు ఇచ్చే నియామకాలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలలోనే కొన్ని నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

NOTE : ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version