తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. సోషల్ డిస్టెన్సిన్గ్, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ వంటి ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ షన్‌ను నిర్వహించనున్నారు.
ఈ నేపధ్యంలోనే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యుల బృందం అసెంబ్లీ, మండలి సమావేశ మందిరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించింది. అలాగే కరోనా దృష్ట్యా మరో 42 సీట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు.