నవంబర్ 23 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

నవంబర్‌ – 23 – కార్తీకమాసం – సోమవారం.

మేషరాశి:ఈరోజు మిశ్రమఫలితాలు !

ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. మీరు పని చేసే వాతావరణం మెరుగు పడుతుంది. మీ చుట్టూ వాతావరణం ఆహ్లదకరంగా ఉండేలా చూసుకోండి. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ తోటివారి నుంచి మీకు సాయం అందుతుంది. పనులు ఆలస్యం అవుతాయి. కానీ తొందరలోనే అన్ని సర్దుకుంటాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీ శివాభిషేకం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు!

అనుభవజ్ఞులైన వ్యక్తులు మీకు ఉపాధి రంగంలో సాయం చేస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. మీ దూరదృష్టి వలన మీ పని సులభంగా పూర్తవుతుంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. తోబుట్టువుల సాయం అందుతుంది. ఆర్ధిక ప్రయోజనాలతో జీవిత భాగస్వామి కూడా సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః పంచామృతాలతో అభిషేకం చేయండి.

 

మిధునరాశి:ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పని వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఏదైనా కొత్త పధకం పై డబ్బు ఖర్చు చేయాలనుకుంటే అది మీకు కలిసొస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శివకవచం పారాయణం చేయండి. మంచి జరుగుతుంది.

 

కర్కాటకరాశి:ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలం!

ఈరోజు అనుకూల ఫలితాలు, కెరీర్ కు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల కాలం. స్నేహితుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం కోసం కొంత సమయం కేటాయిస్తారు. పిల్లలు మీకు ఆనందాన్ని కలిగిస్తారు.

పరిహారాలుః శివాలయంలో దీపారాధన, ప్రదక్షణలు చేయండి.

 

సింహరాశి:ఈరోజు అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు!

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోవడానికి ఇది అనుకూల సమయం. మీ సోదరుల సలహాతో వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తారు. సవాళ్ళను చక్కగా ఎదుర్కొంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. వైవాహికంగా సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు పేదలకు ఆహారపదార్థాలు అందివ్వండి.

 

కన్యరాశి:ఈరోజు కుటుంబ సంపద పెరుగుతుంది!

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు మార్పు కోరుకుంటుంటే, సెలవు దినాల్లో ఏదైనా టూర్ ప్లాన్ చేయండి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దల మార్గదర్శకత్వంలో రాణిస్తారు. కుటుంబ సంపదను, పేరు ప్రతిష్టలను పెంచుతారు. వైవాహికంగా సంతోషంగా గడుపుతారు.

పరిహారాలుః శ్రీ శివపంచరత్నకం చదవండి. శివారాధన చేయండి.

 

తులరాశి:ఈరోజు ఇంటి వాతావరణం అనుకూలిస్తుంది!

ఈరోజు ఇంట బయటా సమస్యలు పరిష్కరమవుతాయి. ఇంటివాతావరణం మీకు అనుకూలిస్తుంది. కొత్త పనులు చేయడానికి ఇది సరైన సమయం. ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ జీవితంలో మీరు గౌరవం పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః మారేడు దళాలతో ఆరాధన చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు మీ సామాన్లు జాగ్రత్తగా చూసుకోండి !

ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. మీ నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయన్న విషయం మరో సారి రుజువవుతోంది. ప్రయాణాల్లో మీ సామాను జాగ్రత్తగా చూసుకోండి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. తల్లిదండ్రుల సహకారంతో కార్యాలు చేపడుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః రుద్రాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

 

ధనుస్సురాశి:ఈరోజు మీకు లాభం చేకూరుతుంది!

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఉపాధి కోరుకునే వారికి విజయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదిస్తే, మీకు లాభం చేకూరుతుంది. మీ నూతన వ్యాపార భాగస్వాములు మీకు లాభం కలిగిస్తారు. వైవహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివకవచం పారాయణం చేయండి.

 

మకరరాశి:ఈరోజు వ్యాపారంలో అనుకూలం !

ఈరోజు మీకు సానుకూల ఫలితాలను వస్తాయి. మీ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. మీ వ్యాపారంలో సోదర సోదరీమణులు సహకారం అందిస్తారు. కుటుంబ జీవితంలో, మీ అంచనాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. వైవాహికంగా సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివపార్వతి ఆరాధన చేయండి.

 

కుంభరాశి:ఈరోజు కోర్టు కేసుల్లో విజయం !

ఈరోజు కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. మీ మాటలతో కుటుంబ సభ్యులను మంత్రముగ్ధులను చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేఉస్కోవడం కోసం నూతన ప్రాజెక్ట్ లను ఒప్పుకుంటారు. మరింతగా కష్టపడితే, విజయం మీ సొంతం అవుతుంది.

పరిహారాలుః శివ అష్టోతరం చదవండి. ఉపవాసం చేయండి.

 

మీనరాశి:ఈరోజు ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది !

ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. ఏదైనా సమస్యల వల్ల  భయపడుతుంటారు. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. అభివృద్ధి అంతగా జరగదు. మీరు సమతుల్యం చేసుకోవడంలో ఇంకా ఆలస్యం చేయకండి.  వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శివాలయంలో దీపారాధన, ప్రదోషకాల పూజలు చేయండి.

 

   శ్రీ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version