అక్టోబర్ తో పోల్చితే నవంబర్ లో క్రియాశీల కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు చాలా తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. మణిపూర్ లో గత నెలలో… 2000 యాక్టివ్ కేసులు ఉంటే… ఇప్పుడు 3500 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో యాక్టివ్ కేసులు 26000 నుండి 33000 కు పెరిగాయని వివరించారు. కేరళలో 77000 నుండి యాక్టివ్ కేసులు 86000 కు పెరిగాయి అని చెప్పారు.
గత 7 వారాలలో వారాల లెక్కన చూస్తే… కొత్త కేసుల క్షీణతను తాము గమనించామని చెప్పారు. వారాల ప్రకారం చూస్తే భారీగా కేసులు తగ్గుతున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ఆస్పత్రులపై పెద్దగా భారం పడే అవకాశం లేదు అని ఆయన వివరించారు. రికవరీ రేటు 92% గా ఉందని అన్నారు.