ఫ్లిప్ కార్ట్ తాజాగా వినియోగదారులకి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఫ్లిప్ కార్ట్ తాజాగా ఇచ్చిన ఆఫర్ కి బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు ఝలక్ తగిలింది. ఫ్లిప్ కార్ట్ కూడా డెలివరీ సర్వీసెస్ ని లాంచ్ చేసింది. అయితే ఈ సర్వీసుల ద్వారా 90 నిమిషాల్లోనే డెలివరీ అందిస్తామని చెప్పింది. దిగ్గజ ఈ కామర్స్ ఫ్లిప్ కార్ట్ తీసుకున్న నిర్ణయంతో షాపింగ్ చేసే వాళ్ళకి శుభవార్త అనే చెప్పాలి. ఇక 90 నిమిషాల్లోనే డెలివరీ అందిస్తున్నట్లు ప్రకటించింది ఫ్లిప్ కార్ట్ .
గ్రోసరీస్, హోమ్ ఆక్సిస్సోరీస్ కొనుగోలు చేస్తే కేవలం గంటన్నర లోనే డెలివరీ పొందవచ్చని తెలిపింది. ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఈ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే ప్రస్తుతం గ్రోసరీస్ ని 90 నిమిషాల్లో అందిస్తున్నట్లు చెప్పింది. కేవలం గ్రోసరీస్ మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్లు కూడా వేగంగా డెలివరీ చేస్తామని చెప్పింది.
ఇలా వేగంగా డెలివరీ చేసే సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఇవి అందుబాటులో ఉండవు. కేవలం బెంగళూరులోని కొన్ని లొకేషన్ లోకి డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో మాత్రం అన్ని చోట్ల ఇవి అందుబాటులోకి వస్తాయని చెప్పింది. అయితే కంపెనీ ఎప్పుడు వీటిని అందిస్తుందో ఖచ్చితంగా తెలియదు. జియో మార్ట్ కి కూడా ఝలక్ ఇచ్చిందని చెప్పాలి.
కానీ ఇది షాపింగ్ చేసే వాళ్ళకి నిజంగా మంచివార్త గూగుల్ కి చెందిన డుంజో, స్విగ్గీ కూడా భారత్‌లో గ్రాసరీస్‌ను డెలివరీ చేస్తున్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతోంది అలాంటి సందర్భాల్లో కూడా గ్రోసరీస్ ఆన్ లైన్ లో డెలివరీ చేయడం తో ఫుల్ డిమాండ్ పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.