మార్గదర్శక సూత్రాలు: సోము వీర్రాజు తప్పక చదవాల్సిన అంశం ఇది!

-

ఏపీలో బీజేపీ త‌న ఇంటిని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో భాగంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకాన్ని చూడొచ్చు! అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయం రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఎంత అర్ధం అవుతుందో… అంతకు మించి కన్నా లక్ష్మీనారాయణకు అర్ధం అయ్యి ఉంటుంది! ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సోము వీర్రాజు… పార్టీకోసం ఏమి చేస్తాడు, ఏమి చేయాలి అనేదానికంటే… ఏమి చేయకూడదు అనే విషయాల్లో కన్నా నుంచి పరోక్షంగా చాలా ఇన్ ఫర్మేషన్ ఉందనే అర్ధంచేసుకోవాలి!

bjp party

అవును… సోము కొత్తగా పార్టీకి ఏమి చేస్తారు.. ఆయన స్టైల్ ల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు.. అసలు సిసలు బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ఎలా న్యాయం చేస్తారు అనే సంగతులు కాసేపు పక్కనపెడితే… అసలు “ఏమి చేయకుండా ఉంటే చాలు” అనే విషయాలపై చర్చలు నడుస్తున్నాయి!

భాజపా అధ్యక్షుడిగా కన్నా రావడంతో.. తొలిసారి కాపు సామాజిక వర్గం చేతికి భాజపా పగ్గాలు వచ్చాయి. కన్నా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తారని పెద్దలు భావించారు… కానీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం దగ్గరగా రావడం కోసం తన చేతిలో అధిష్టానం ఏపీ పార్టీ పగ్గాలు పెట్టింది అన్న సంగతి కన్నా పరిపూర్ణంగా విస్మరించారు. ఇది సోము వీర్రాజు చేయకూడని ఫస్ట్ పని!

కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల చేతుల్లో రెండు ప్రధాన పార్టీలు ఇప్పటికే అత్యంత బలంగా ఉన్నాయి కాబట్టి… ఆంధ్రలో కాపులు బలమైన ఓటు బ్యాంక్ కనుక “కన్నా” చేతిలో పార్టీ పగ్గాలు పెట్టింది. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేయ్యాల్సిందాంట్లో ప్రధానమైన అంశం… ఆ రెండు పార్టీలకు సమాన దూరం మెయింటెయిన్ చేయడం! కానీ కన్నా అలా చేయలేదు. వైకాపాను టార్గెట్ చేస్తూ, తేదేపాకు “పిల్లపార్టీలా” ప్రవర్తించారు! ఇది సోము వీర్రాజు చేయకూడని రెండో పని!

ఇదే సమయంలో ఢిల్లీ పెద్దలకు – ఏపీ సీఎం జగన్ కు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి… పార్టీలు వేరు – ప్రభుత్వాలు వేరు అన్న విషయం గ్రహించుకుంటూ కన్నా మెయింటెయిన్ చేయ్యాల్సింది.. కానీ మిస్సయ్యారు! ap bjp partyఇదే క్రమంలో కేంద్రంలోని పెద్దలకు – చంద్రబాబుకు మధ్య ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించి, నడుచుకునే విషయంలో కూడా కన్నా తప్పటడుగులు వేశారు! ఇది సోము వీర్రాజు చేయకూడని మూడో పని!

ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా.. అనధికారికంగా బాబు గైడ్ లైన్స్ నే ఫాలో అయ్యారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండేవి! ఫలితంగా పసుపురంగు ఉన్న బీజేపీ నేతలకు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది.. దాంతో అసలుసిసలు బిజేపీ కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం లేకుండా పోయాయి! సోము వీర్రాజు చేయ్యకూడని నాలుగోపని ఇది!

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్… కన్నా చేసిన తప్పులు చేయకపోవడంతోపాటు.. పార్టీ అధిష్టానం మనసు ఎరిగి ప్రవర్తించడం, కాపుసామాజిక వర్గాన్ని మరింత దగ్గరచేసుకుంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతంచ చేయడం చేయాలి! ఈ నాలుగేళ్లూ ఈ విషయంలో సోము వీర్రాజు సిన్సియర్ గా పనిచేస్తే… రాబోయే ఎన్నికల్లో “బీజేపీ – జనసేన” కూటమి తరుపున సీఎం అభ్యర్ధిగా సోము పేరు వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు! అలా కానిపక్షంలో… ఢిల్లీ పెద్దలకు ఏపీలో మరో అనుభవం రావడం తప్ప .. పార్టీకి ఒరిగేదేమీ లేదు!

Read more RELATED
Recommended to you

Exit mobile version