యూట్యూబ్‌ ఆఫర్‌.. మీ వీడియోలకు డబ్బులు!

-

యూట్యూబ్‌ ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. గతంలో టిక్‌టాక్, స్నాప్‌ఛాట్‌ లాంటివి వెళ్లిన దారిలోనే ప్రస్తుతం యూట్యూబ్‌ కూడా అడుగులు వేస్తుంది. యూట్యూబ్‌ వీడియో క్రియేటర్ల కోసం ఇవి ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసి వారికి ఇచ్చాయి. టిక్‌టాక్‌ 200 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ క్రియేట్‌ చేయగా, స్నాప్‌చాట్‌ తన టిక్‌టాక్‌ తరహా సర్వీసు స్పాట్‌లైట్‌ ద్వారా రోజుకి ఒక మిలియన్‌ డాలర్లు ఇచ్చాయి.

ప్రైవసీ కారణాలతో కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్‌ చేసింది. దీంతో చాలా సంస్థలు అలాంటి యాప్‌లను తయారు చేశాయి. అయితే, ఇవన్నీ ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. గూగుల్‌ కూడా ఆ ఉద్దేశంలో యూట్యూబ్‌ షార్ట్స్‌ అని సెక్షన్‌ ఇచ్చింది. టిక్‌ టాక్‌ తరహా సేవలను అందించనుంది. అయితే ఇందులో కంటెంట్‌ పెంచడానికి ఇప్పుడో ఆలోచన చేసింది. అదే డబ్బులివ్వడం. ఇప్పుడు షార్ట్‌ వీడియోలు చేసే క్రియేటర్లకు యూట్యూబ్‌ డబ్బులిస్తుందట. షార్ట్‌ వీడియో క్రియేటర్లకు ప్రోత్సాహకంగా 100 మిలియన్‌
డాలర్లను వెచ్చించడానికి సంస్థ సిద్ధమైంది. భారత్, యూఎస్‌లో ఈ ఫండ్‌ను క్రియేటర్లకు ఇవ్వనున్నారు.

వినియోగదారులను ఆకట్టుకునే కంటెంట్‌ చేసే క్రియేటర్లకు ఈ ఫండ్‌ నుంచి ప్రతి నెలా డబ్బులు ఇవ్వనున్నారు. అయితే ఎంత మొత్తం ఇస్తారనేది మాత్రం చెప్పలేదు. ప్రతి నెలా జీతం తరహాలో డబ్బులు వస్తాయనేది టాక్‌. అలా అని అందరికీ ఇవ్వరు. ఒరిజినల్, ఇంట్రస్టింగ్‌ కంటెంట్‌ చేస్తేనే డబ్బులు ఇస్తారు. ఆ కంటెంట్‌కి వచ్చే వ్యూస్‌ను కూడా ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు. త్వరలో ఈ విధానం మొదలుపెట్టి… వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నారు. దీని వల్ల యూట్యూబ్‌ షార్ట్స్‌లో ఆసక్తికరమైన కంటెంట్‌ వస్తుందని గూగుల్‌ భావన.

ఇప్పటికప్పుడు అయితే మన దేశంలో టిక్‌ టాక్‌ తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మన దేశంలో ఉన్న టిక్‌టాక్‌ తరహా యాప్స్‌ పుంజుకోవాలని చూస్తున్నాయి. జోష్, మోజ్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది యూట్యూబ్‌ షార్ట్స్‌లో కంటెంట్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫండింగ్‌ మొదలైతే మరికొంతమంది ఇటువైపు వస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news