హోమ్ లోన్ తీసుకుంటే సొంత ఇంటి కల ని సార్ధకం చేసుకోవడానికి అవుతుంది. ప్రతీ ఒక్కరు కూడా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటూ వుంటారు. దాచుకున్న డబ్బు తో కొనడం కుదరదు కనుకే హోమ్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే భారత దేశం లో వున్నా వాళ్ళకి హోమ్ లోన్ వస్తుంది మరి ఎన్ఆర్ఐ భారత్ లో ఇళ్లు నిర్మించుకోవడానికి లోన్స్ వస్తాయా..?
బ్యాంకులు లోన్ ఇస్తాయా..? ఈ విషయాన్నే ఇప్పుడు చూద్దాం. హోమ్ లోన్ తీసుకోవాలంటే ఎన్ఆర్ఐ దరఖాస్తుదారుడు ముందుగా దరఖాస్తును పూర్తి చేసి.. సంతకాలు చేసి ఫొటోలతో వున్నా అప్లికేషన్ ని బ్యాంక్ లో సబ్మిట్ చెయ్యాల్సి వుంది. అలానే ఆ వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీ పత్రాన్ని కూడా అందించాలి. దీనితో మీ తరపున ఆస్తి లావాదేవీని పూర్తి చేయడానికి ఇండియా లో నివసిస్తున్న వారికి అధికారం ఇస్తుందన్నమాట.
ఆ తరవాత మీరు ఉంటున్న దేశం లో కాన్సులేట్ అధికారి లేదా నోటరీ సమక్షంలో ఈ పీఓఏపై సంతకం పెట్టాలి. ఆ తరవారా భారతదేశంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించి పత్రాలను తీసుకోవాలి. ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు చూద్దాం.
భారతీయ పాస్‌పోర్ట్, వీసా కాపీ అవసరం. అలానే మీ నివాస దేశం లోని వర్క్ పర్మిట్/జాబ్ కాంట్రాక్ట్/అపాయింట్‌మెంట్ లెటర్లు ఉండాలి. తాజా ఆదాయపు పన్ను రిటర్న్స్, మీ పే స్లిప్స్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ప్లాన్/బిల్డింగ్ అనుమతి, రెరా నమోదు కాపీ వంటివి అవసరం అవుతాయి. పూర్తి వివరాలని మీరు లోన్ తీసుకుంటున్న బ్యాంక్ అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు.