వారికి రూ.50 లక్షల ఫైన్… ఆ తప్పు చెయ్యద్దు మరి..!

-

ఈ మధ్య టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యిపోయింది. దీనితో ప్రతీ ఒక్కరు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా వుంటున్నారు. పైగా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా చాల మంది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్లకి నచ్చిన వాటిని ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసే వారికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకు రావడం జరిగింది.

ఇక ఇప్పుడు వాటి కోసం చూసేద్దాం. ఒకవేళ కనుక ఈ రూల్స్ ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించనుంది. జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. 2025 నాటికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ రూ.2800 కోట్లకు చేరుతుందని అంచనా. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించింది.

ఎండార్స్‌మెంట్ నో హౌస్ పేరుతో వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందట. అంతేకాదు బ్యాన్ చేయడం కానీ ఎండార్స్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌పై ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించడం కానీ ఎండార్సర్లపై రూ.10 లక్షల జరిమానా లేదంటే గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా కూడా పడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version