అమెరికా లో సిక్కు యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం…!!!

-

జీవితంపై అందరి ఆసక్తి ఒకేలా ఉండదు. కొందరికి ప్రశాంతమైన ఉద్యోగం చేసుకోవటం లో తృప్తి ఉంటే, మరికొందరికి ఉరుకులు పరుగులు పెట్టె పనులు నచ్చుతాయి. ఇంకొంతమందికి ఎవరు చేయని పనులు చేయటం లో కిక్ దొరుకుతుంది.  ఎక్కువగా యువతలో చూస్తుంటాం మనం ఈ రకం ఆలోచనలు. అలాంటి ఆలోచనలు కొన్ని సార్లు మంచి అనుభావాన్నిస్తే, మరికొన్ని సార్లు చేదు అనుభవాలని మిగుల్చుతాయి.

ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది అమెరికాలో ఒక భారత సంతతి సిక్కు యువకుడికి. ఈ యువకుడికి పర్వతారోహణ అంటే చాల ఇష్టం. ఈ ఇష్టమే అతన్ని గాయలపాలు చేసింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉండే అతిపెద్దదైన ది పీర్లె గేట్స్ కొండని ఎక్కటానికి తన స్నేహితులతో కలసి అక్కడకి వెళ్ళాడు. చాల  దూరం  ప్రయాణించాడు . ఇంకొంత దూరం వెళితే శికరాగ్ర భాగాన్ని చేరుకుంటారు, కాని ఈలోపే..

 

అక్కడ మంచుగాడ్డపై కాలు మోపడంతో అమాంతం అక్కడ నుంచి జారిపడిపోయాడు. కొండ ఎత్తు 150 మీటర్లు కావడంతో గాయాలు కూడా ఎక్కువగానే తగిలాయి. అతడు పడిపోయిన ప్రదేశానికి చేరుకోడానికి రెస్క్యూ టీం కి సుమారు 4గంటలు సమయం పట్టిందని మీడియా తెలిపింది. అక్కడ నుంచి వెంటనే ఆ యువకుడిని పోర్ట్ ల్యాండ్ లోని హాస్పిటల్ కి తరలించారు..

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news