దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై ఎన్టీఆర్, మంచు మ‌నోజ్ రియాక్ష‌న్‌.. ఇంత కిక్కుందా అంటూ..

-

దిశ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ గురైన విష‌యం తెలిసిందే. దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలం దగ్గరకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. పోలీస్‌ జిందాబాద్‌ అంటూ ప్రజల నినాదాలు చేస్తున్నారు. అయితే దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ పై హీరో ఎన్టీఆర్ స్పందించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఘ‌ట‌న‌పై హీరో మంచు మనోజ్ కూడా స్పందించారు. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా? అంటూ మనోజ్ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..? ఈ రోజునే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! ’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవలే ఆయన దిశ ఇంటికి వెళ్లి సైతం ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version