బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్‌..!?

-

తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తన డైలాగ్ తో.. అదిరిపోయే స్టెప్పులతో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలో ఒక్కరిగా నిలిచాడు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు బుల్లితెర‌పై కూడా ఇప్ప‌టికే తానేంటో నిరూపించుకున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆయన మాటలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో మంచి స‌క్సెస్ అయింది. ఆ తర్వాత రెండో, మూడో సీజన్‌కు కూడా తారక్ వచ్చే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి కానీ, అది జరగలేదు. బిగ్ బాస్ లాంటి షో కాకుండా ఏదైనా టాక్ షో చేస్తే బావుంటుందని ఎన్టీఆర్ అనుకున్నారట.

తాజాగా ఎన్టీఆర్‌ కోసం ఓ ప్రముఖ టీవీ చానెల్‌ ప్రత్యేకమైన షోను ఏర్పాటు చేసిందట. ఈ టాక్‌ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌న్న వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు గాని శని ఆదివారాల్లో తారక్ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలాట. అందుకే తారక్ ఈజీగా ఒప్పేసుకున్నాడట. షోను కొనసాగిస్తూనే షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు లైన్స్ లో ఈ టాక్ షో సాగుతుంద‌ని స‌మాచారం. ఈ షో కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్ర‌త్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్న‌ట్టు టాక్‌. దీనికోసం రెండు ఫ్లోర్ ల‌ను బుక్ చేసుకున్నాడ‌ట మేక‌ర్స్. మ‌రి దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version