ఎన్టీఆర్ దేవర గ్లిమ్ప్స్ రికార్డ్… మామూలు క్రేజ్ లేదు..!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఎక్కడైనా సముద్రం ఎరుపెక్కుతుందా అంటే సూర్యునికో లేదంటే సూర్యాస్తమయంకో అని అటువంటి విజువల్ కనబడుతుంది. కానీ దేవర ఊచకోతకి రక్తపాతంతో సముద్రం ఎరుపెక్కింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. 80 క్షణాల గ్లిమ్ప్స్ తో బ్లడ్ బాత్ కి శాంపిల్ చూపించారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పిన తర్వాత రక్తంతో కలిసిన అలలు ఎన్టీఆర్ మీద పడడం చాలా అద్భుతంగా ఉంది.

దేవర షూటింగ్ కోసం ఏకంగా బ్లడ్ టాంకర్స్ ని తీసుకెళ్లరు కొరటాల శివ. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది. దేవర గ్లిమ్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ట్విట్టర్లో దేవర ట్యాగ్స్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. 24 గంటల్లోనే రికార్డులను బ్రేక్ చేసేసింది ఏకంగా 40 మిలియన్ వ్యూస్ ని దేవర సినిమా గ్లిమ్స్ తెచ్చుకుంది. కేవలం తెలుగులో 22 మిలియన్ న్యూస్ ని సొంతం చేసుకుంది దేవర గ్లిమ్ప్స్ కి 650 k లైక్స్ ని సాధించింది

Read more RELATED
Recommended to you

Exit mobile version