ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ టీజర్.. బుల్లితెరా కాసుకో !

-

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ఒక షో చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. గతంలో కింగ్ నాగార్జున హోస్ట్‌ గా రూపొందిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే షోని మార్చి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులుగా మార్చి జెమినీ టీవీ స‌రికొత్త షో ప్లాన్ చేసింది.

ఈ  షోనే ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. ఈ టీజర్ కూడా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అంటూ ఓ ప్రోమో విడుద‌ల చేయ‌గా, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్‌ని పూర్తిగా రివీల్ చేయ‌కుండా, షాడో లా చూపించారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ కు సంబంధించి కొన్ని ప్రోమోలు కూడా అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్రివిక్ర‌మ్ వీటిని డైరెక్ట్ చేయ‌గా, రానున్న రోజుల‌లో ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నారin అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ క్రేజ్ దెబ్బకు ఈ షో సూపర్ హిట్ కావడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version