హాస్పటల్ నుండి ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ డిశ్చార్జ్..!

-

చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ కు సంబంధించిన వార్త నిన్న హల్ చల్ చేసిన సఙ్గతాహి తెలిసిందే. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిని అన్ని రకాలుగా ఆదుకుంటాను అని మాట ఇచ్చిన ఎన్టీఆర్.. తర్వాత ఏ రకమైన సాయం చేయలేదు అని అభిమాని తల్లి చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో మాట తప్పిన ఎన్టీఆర్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేసారు ఎన్టీఆర్.

క్యాన్సర్ తో అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న కౌశిక్ ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు. ఈ విషయాన్ని కౌశిక్ తల్లి తెలిపింది. థాంక్యూ ఎన్టీఆర్ సార్.. నేను ఎప్పుడూ ఎన్టీఆర్ గారు మరియు ఆయన ఫ్యాన్స్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. నా కొడుకు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడు. ఈరోజు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతున్నాం. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ గారి టీమ్ కి ప్రత్యేక ధన్యవాదములు అని వీడియోలో పేర్కొంది ఆమె.

Read more RELATED
Recommended to you

Latest news