రాముడు కృష్ణుడు
ఎక్కడయినా మనకు కనిపిస్తే
ఎన్టీఆర్ మాత్రమే అయి ఉండాలి లేదా
వాళ్లే ఎన్టీఆర్ రూపంలో కనిపిస్తే
మనం ఆనందించి పక్కకు తప్పుకుపోవాలి
గోదావరి తీరాల చెంత నిన్నటి వేళ జరిగిన
బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ అన్నది ఎన్నో సంగతులకు
కేరాఫ్…
ఇంకా ఇంకా తెలుగు వారికి సుపరిచితమే!
బంగార్రాజు సినిమా నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి..ఎన్ని అవరోధాలున్నా అనుకున్న పని అనుకున్న సమయానికి చేయాలని..బంగార్రాజుకు ఈ విషయం నాన్న నేర్పాడు. ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులు నుంచి నేర్చుకున్నదంతా ఇదే! ఏఎన్నార్ ఒక్కరే కాదు ఆయన జీవితాన్ని ఎన్టీఆర్ కూడా ఎంతో ప్రభావితం చేశారు. బంగార్రాజు ఇవాళ ఇంతగా దూసుకుపోతున్నాడంటే ఆ ఇద్దరి ప్రభావం ఎంతో! అందుకే నిన్నటి వేళ నాగ్ ఓ మంచి మాట బ్లాక్ బస్టర్ మీట్ లో చెప్పాడు ఏఎన్నార్ లివ్స్ ఆన్.. ఎన్టీఆర్ లివ్స్ ఆన్ అని! పైనున్న దేవతులు తథాస్తు అన్నారు. అంటారు కూడా!
రామారావు అనే ఈ నాలుగు అక్షరాలు లేకపోతే చరిత్రకు మరో కొత్త అధ్యాయం ఉండదు అని రాయండి.రామారావు అని రాసేకన్నా ఎన్టీఆర్ అని పొడి అక్షరాలతో రాసిన కన్నీటి తడులు మాత్రం అలానే ఉంటాయి ఆ అక్షర మాలపై అని కూడా రాయండి. జాతి చెప్పుకోదగ్గ నటుడు అని చాటడం కాదు గర్వించదగ్గ నటుడు అని చెప్పడం ఇప్పుడిక బాధ్యత.ఇంకా చెప్పాలంటే… కృష్ణ తీరంలో పుట్టిన ఓ యువకుడు తెలుగు చిత్రసీమను శాసించే స్థాయికి ఎదిగాడు.ఓ చిన్న ఉద్యోగి కాస్త పెద్ద,పెద్ద పదవులు అందుకునే స్థాయికి ఎదిగాడు.ఆయన నటించిన ప్రతి చిత్రం ఆణిముత్యమై విరాజిల్లేంత స్థాయికి తీసుకు వెళ్లాడు. ఆయన పేరు ఎన్టీఆర్.. పూర్తి పేరు నందమూరి తారక రామారావు.