95వ ఆస్కార్ అవార్డు వేడుకలు.. మరో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్

-

అమెరికాలోని లాస్ ఏంజెల్స్​లో 95వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. హాలీవుడ్ సినీ తారలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్​కు నామినేట్ అయిన తారలు.. అతిథులు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది అవార్డుల వేడుకలో ఇండియా నుంచి పాల్గొన్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. ఆస్కార్ వేడుకల్లో ఎక్కడ చూసినా.. మన కొమురం భీమ్(ఎన్టీఆర్), అల్లూరి సీతారామరాజే(రామ్ చరణ్) సందడి చేశారు.
ఆస్కార్‌ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్‌ మీడియా, న్యూస్‌ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్‌ మేల్‌ మెన్షన్స్‌)లో ఎన్టీఆర్‌ (NTR) నం.1 స్థానంలో నిలిచినట్లు సోషల్‌ మీడియాను విశ్లేషించే నెట్‌బేస్‌ క్విడ్‌ తెలిపింది. ఆయన తర్వాత రామ్‌చరణ్‌ ఉన్నారు. ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్‌’ నటుడు కె హుయ్‌ ఖ్యాన్‌,  ఉత్తమ నటుడు బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ది వేల్‌), అమెరికన్‌ యాక్టర్‌ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version