ఎన్టీఆర్ ఇంత ప్లానింగ్ తో ఉన్నాడా…?

-

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న డిమాండ్ అందరికి తెలిసిందే,. అతనితో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతల తమ తమ సినిమాలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజమౌళి ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ని విడుదల చేసాడు. ఇక ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మూడేళ్ళ పాటు సినిమాలను ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది త్రివిక్రమ్ సినిమాను కూడా విడుదల చేయనున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ తో కూడా మరో సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది మొదలు అవుతుంది. ఆ తర్వాత ఇక బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాలు అన్నీ వచ్చే మూడేళ్ళ లో విడుదల చేయడానికి అతను సిద్దమైనట్టు తెలుస్తుంది. వేగంగా సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version