కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను మొదలు పెట్టారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ఎన్నో సంస్థలు శ్రమిస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా సైంటిస్టులు ఈ విషయంలో చాలా వరకు సక్సెస్‌ను సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే.. మనకు ఇప్పటికే అందుబాటులో ఉన్న.. ఐవర్‌మెక్టిన్ అనే ఓ డ్రగ్ కరోనా వైరస్‌ను కేవలం 2 రోజుల్లోనే పూర్తిగా నాశనం చేస్తుందని తేల్చారు.
ఐవర్‌మెక్టిన్ (ivermectin).. పారాసైట్ల వల్ల మనకు సంభవించే వ్యాధులను నయం చేయడానికి ఈ డ్రగ్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పారాసైట్ల వల్ల మనకు పలు రకాల చర్మ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటిని నయం చేసేందుకు ivermectin ను ఇప్పటికే అనేక మంది డాక్టర్లు వాడుతున్నారు. అయితే ఇప్పుడిదే డ్రగ్ కరోనా వైరస్‌ను 48 గంటల్లో చంపేస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ల్యాబ్‌లో చేసిన టెస్టులు సత్ఫలితాలను ఇచ్చాయి.
ivermectin డ్రగ్ కేవలం ఒక్క డోస్ ఇస్తేనే.. 48 గంటల్లో కరోనాకు చెందిన ఆర్ఎన్ఏ అణువులన్నీ నాశనమయ్యాయట. ఈ మేరకు మోనాష్ వర్సిటీ పరిశోధకుడు కైలీ వాగ్‌స్టఫ్ తెలిపారు. అయితే ప్రస్తుతం కేవలం ల్యాబ్‌లోనే ప్రయోగాలు చేశామని.. కానీ కరోనా వైరస్ వచ్చిన వారిపై ఈ డ్రగ్‌ను ప్రయోగించాల్సి ఉందని.. దీంతో కరోనాపై ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చని సదరు పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ డ్రగ్ ఇప్పటికే వాడకంలో ఉన్నందున.. దీనికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం సులభతరం అవుతుందని వారంటున్నారు. మరి ఈ సైంటిస్టులు ఈ విషయంపై ఇంకా ఏం చెబుతారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!